Pakistan Blast: విషాదంగా మారిన మిలాద్ ఉన్ న‌బి పండుగ, పాకిస్తాన్ మసీదులో సూసైడ్ బ్లాస్ట్, 34 మంది మృతి, మరో 130 మందికి పైగా గాయాలు

ఆ సూసైడ్ బ్లాస్ట్ వ‌ల్ల సుమారు 34 మంది మ‌ర‌ణించారు. దాదాపు 130 మందికిపైగా గాయ‌ప‌డ్డారు.

Several Killed in Pakistan Mosque Blast (Photo Credits: X/@par3ke)

దాయాది దేశంలోని బ‌లోచిస్తాన్‌(Balochistan)లోని మ‌స్తుంగ్ జిల్లాలో ఇవాళ ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ వ‌ల్ల సుమారు 34 మంది మ‌ర‌ణించారు. దాదాపు 130 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. అల్‌ఫ‌లా రోడ్డు వ‌ద్ద ఉన్న మ‌దీనా మ‌సీదు స‌మీపంలో మిలాద్ ఉన్ న‌బి ర్యాలీ తీసేందుకు జ‌నం గుమ్మిగూడారు. ఆ స‌మ‌యంలో భారీ పేలుడు సంభ‌వించిన‌ట్లు ప్ర‌త్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. డీఎస్పీ గిశ్‌కోరి కారు వ‌ద్ద‌ బాంబు పేలిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఆ ఊరేగింపుకు బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్న పోలీసు వాహ‌నం స‌మీపంలో సూసైడ్ బాంబర్‌ ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

Here's Blast Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)