Pakistan: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న రన్నింగ్ బస్సు, 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో పది మందికి తీవ్ర గాయాలు
బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్ బస్సు మంటల్లో చిక్కుకుంది.
పాకిస్తాన్ లో సింధ్ ప్రావిన్స్ కరాచీ-హైదరాబాద్-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్‌వేపైఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా వరద బాధితులుగా నిర్ధారణ అయ్యింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో పది మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ సెక్రెటరీ సిరాజ్ ఖ్వాసిం వెల్లడించారు. దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులకు వేరే చోట తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో వాళ్లను తిరిగి స్వస్థలానికి ప్రైవేట్ బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)