Iran Attacks Pakistan: తమ దేశంపై ఇరాన్ దాడిని ఖండించిన పాకిస్తాన్, తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరిక

ఈ దాడుల్ని పాక్‌ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. 2023 డిసెంబర్లో ఇరాన్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు.

Two Children Killed in Pakistan From Iran’s Airspace Violation (Photo Credits: X/@conflict_live)

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది.పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని.. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ తెలిపింది.

పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు,డ్రోన్‌లతో ఇరాన్ దాడి, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అటాక్ చేసిన ఇరాన్

అయితే ఈ దాడుల్ని పాక్‌ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. 2023 డిసెంబర్లో ఇరాన్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన పాకిస్థాన్‌ను ఇరాన్‌ మందలించింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రాస్క్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. అదేవిధంగా పాకిస్థాన్‌కు తన సరిహద్దులపై నియంత్రణ లేదని విమర్శించింది.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement