Imran Khan Injured: వీడియో ఇదిగో, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఏకే-47 గన్‌తో కాల్పులు, కాలికి తీవ్రగాయం, మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగినట్లుగా వార్తలు
వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో దుండగుడు సమీపం నుంచే ఏకే-47 గన్‌తో కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగినట్లు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఏకే-47 గన్‌తో కాల్పులు జరిపారు. వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో దుండగుడు సమీపం నుంచే ఏకే-47 గన్‌తో కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగినట్లు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు. ఇమ్రాన్‌పై దాడి జరిగినప్పుడు తాను పక్కనే ఉన్నట్లు ఇస్మాయిల్ చెప్పారు. గాయపడ్డ ఇమ్రాన్‌ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. వజీరాబాద్ లాంగ్ మార్చ్ సమయంలో ఇమ్రాన్‌పై దాడి జరిగినట్లు పీటీఐ నేత ఫవద్ చౌదరీ తెలిపారు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. దాంట్లో సేనేటర్ ఫైసల్ జావెద్, అహ్మద్ ఛాతా ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)