Lahore Bomb Blast: పాకిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు, ముగ్గురు మృతి, 20 మందికి పైగా గాయాలు, లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి వద్ద బాంబు పేలుడు

లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి వద్ద భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Bomb Blast At Tirupati (Representational Image)

పాకిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి వద్ద భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారని లాహోర్‌ పోలీసు అధికారి నాణా ఆరీఫ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారతీయ వస్తువులు అమ్ముతారని తెలిపారు.

గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. పేలుళ్ల ధాటికి మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడికి తామే బాధ్యులమని బలోచ్ నేషనల్ ఆర్మీ ప్రకటించుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)