Israel-Hamas War: భారత్ ఉగ్రవాదానికి పూర్తిగా వ్యతిరేకం, మా మద్దతు ఇజ్రాయెల్‌కే అని స్పష్టం చేసిన భారత్, వారికి అండగా నిలబడతామని ప్రధాని మోదీ హామీ
ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అదే ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఇంతకముందు కూడా ప్రధానిమోదీ ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు ఈ విపత్కర పరిస్థితుల్లో తాము ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని పేర్కొన్నారు.అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు సాయం చేసేందుకు అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను మధ్యదరా సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌కు పంపింది.
Here's PM Modi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)