Prison Riot in Honduras: జైలులో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు, 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి, మొత్తం 41 మంది మహిళా ఖైదీలు మృతి
హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు (Tegucigalpa) వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది మహిళా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు
సెంట్రల్ అమెరికా (Honduran President)లోని హోండురస్ (Honduras)లో రెండు గ్రూపుల మధ్య అల్లర్ల ఘటన చోటు చేసుకుంది. హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు (Tegucigalpa) వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది మహిళా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో సుమారు 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లకు గురి కాగా వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారు తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైలులో ఉన్న రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ మారణహోమానికి కారణమని తెలుస్తోంది.
ANI Tweet