Russia School Shooting: స్కూల్లో ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు, ఆరు మంది అక్కడికక్కడే మృతి,మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలు
రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచాలోవ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు.
రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచాలోవ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. రాజధాని ఐఝెవ్స్క్‌లోని పాఠశాలపై కాల్పులు జరిపిన దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు 1 నుంచి 11 తరగతుల వారిగా గుర్తించారు. విద్యార్థులపై కాల్పులకు పాల్పడిన దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గవర్నర్, స్థానిక పోలీసులు తెలిపారు.అయితే.. కాల్పులకు పాల్పడేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)