Russia-Ukraine Crisis: రష్యా బాంబు దాడులు, 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి, 70కి పైగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన రష్యా
ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు (Over 40 Ukraine Soldier), 10 మంది పౌరులు మృతి (10 Civilians Killed) చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.
రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు (Over 40 Ukraine Soldier), 10 మంది పౌరులు మృతి (10 Civilians Killed) చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రష్యా ప్రకటించిన యుద్ధంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఇక 11 వైమానిక స్థావరాలతోపాటు 70కి పైగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.
రష్యా సైనిక బలగాల ఆధ్వర్యంలో దాడులు జరిపాం. 74 ఉక్రెయిన్ మిలిటరీ గ్రౌండ్ ఫెసిలిటీస్ ధ్వంసం అయ్యాయి అని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెన్‌కోవ్ చెప్పారు. 11 వైమానిక స్థావరాలు, మూడు కమాండ్ పోస్ట్‌లు, 18 రాడార్ స్టేషన్లు ధ్వంసం చేశామన్నారు. ఎస్-300, బక్-ఎం1, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ క్షిపణుల వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తిశామన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)