Genetic Compatibility Testing: పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు కంపల్సరీ.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్టర్ చేస్తారు.. రష్యాలో కొత్త నిబంధన.. ఎందుకంటే?
ఆ సర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్టర్ చేస్తారు. రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బష్కోర్టోస్టన్ లో డాక్టర్లు ఈ కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు.
Newdelhi, Feb 9: పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు (DNA Test) తప్పనిసరి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని (Marriage) రిజిస్టర్ చేస్తారు. రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బష్కోర్టోస్టన్ లో డాక్టర్లు ఈ కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట ముందుగా జన్యు పరీక్షలు(Genetic Compatibility Testing) చేయించుకోవాలన్న నిబంధన విధించారు. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే జన్యు పరీక్షలు తప్పనిసరిగా అని తేల్చారు. వివాహా మహోత్సవానికి ముందు రిజిస్ట్రీ ఆఫీసులో కచ్చితంగా సర్టిఫికేట్‌ను జతపరుచాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు ఎటువంటి రుగ్మతలు కానీ అంగవైకల్యం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)