Sex Change Ban in Russia: ఇకపై లింగ మార్పిడి సర్జరీలు చికిత్సపై నిషేధం, సెక్స్ చేంజ్ బ్యాన్ బిల్లుపై సంతకం పెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇన్నాళ్లూ లీగల్‌గా ఉన్న లింగ మార్పిడి సర్జరీలు, చికిత్సపై రష్యా నిషేధం విధించింది. సెక్స్ చేంజ్‌ను బ్యాన్ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై దేశాధ్యక్షుడు పుతిన్(Putin) సంతకం చేశారు. ట్రాన్స్‌జెండర్ పరిశ్రమ కట్టడి కోసం పుతిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇన్నాళ్లూ లీగల్‌గా ఉన్న లింగ మార్పిడి సర్జరీలు, చికిత్సపై రష్యా నిషేధం విధించింది. సెక్స్ చేంజ్‌ను బ్యాన్ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై దేశాధ్యక్షుడు పుతిన్(Putin) సంతకం చేశారు. ట్రాన్స్‌జెండర్ పరిశ్రమ కట్టడి కోసం పుతిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఏవైనా సీరియస్ మెడికల్ కేసులు తప్పితే మరే కేసుల్లోనూ లింగ మార్పిడిని అంగీకరించేదిలేదని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.
కొత్త చట్టం ప్రకారం.. డ్రగ్స్ వాడరాదని, సర్జరీలు చేయరాదు. లైసెన్సు పొందిన క్లినిక్‌లు మాత్రమే లింగ మార్పిడి చికిత్స కోసం అనుమతి ఇస్తాయని రష్యా ఆరోగ్యశాఖ తెలిపింది. ఐడీలపైన కానీ, ఇతర డాక్యుమెంట్లపై కానీ .. ప్రజలు తమ లింగాన్ని ఫ్రీగా మార్చుకోరాదని కొత్త బిల్లులో సూచించారు. పెళ్లి చేసుకున్న జంట కూడా సెక్స్ చేంజ్ చేయించుకుంటే, వాళ్ల పెళ్లిని రద్దు చేయనున్నారు. 2018 నుంచి 2022 వరకు రష్యాలో సుమారు రెండు వేల మంది లింగ మార్పిడి చేసుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)