Bangladesh Protests: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, చెలరేగిన హింస నేపథ్యంలో తలదాచుకోవడానికి భారత్ బయలుదేరినట్లుగా వార్తలు
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది. ఆదివారం ఘర్షణల్లో 100 మందికిపైగా మృతి చెందగా.. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో మొత్తం 300 మంది చనిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ లో మరోసారి రక్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంటర్నెట్ సేవలు బంద్
ఆందోళనకారులు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో షేక్ హసీనా భారత్‌కు బయలుదేరినట్లు సమాచారం.తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఢాకా ప్యాలెస్ నుంచి హసీనా ఆర్మీ హెలికాప్టర్‌లో భారత్ బయలుదేరినట్లు సమాచారం.గడిచిన 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్ హసీనాకు తాజా ఆందోళనలు సవాలుగా మారాయి. రాజధాని రోడ్లపై నిరసనకారులు ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. రాజధానిని జిల్లాలకు కలిపే మార్గాలన్నింటిని మూసేశారు. సిరాజ్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఆందోళనకారుల దాడిలో ఏకంగా 13 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు.
Here's News
Here's Protest Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)