Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం, కొండ ప్రాంతంలో కుప్పకూలిన టూరిస్టుల‌తో వెళ్తున్న ఫ్టైట్, 12 మంది మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

కెన్యా తీర ప్రాంతం క్వాలే (Kwale)లో మంగళవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాసాయి మారా జాతీయ రిజ‌ర్వ్ ఫారెస్టుకు టూరిస్టుల‌తో వెళ్తున్న విమానం కూల‌డంతో 12 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Small Plane Crash in Kenya’s Kwale (Photo-KASS FM OFFICIAL)

కెన్యా తీర ప్రాంతం క్వాలే (Kwale)లో మంగళవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాసాయి మారా జాతీయ రిజ‌ర్వ్ ఫారెస్టుకు టూరిస్టుల‌తో వెళ్తున్న విమానం కూల‌డంతో 12 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ద‌యాని ఎయిర్ స్ట్రిప్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో విమానం కూలిన‌ట్లు అధికారులు గుర్తించారు.

విమానం కూలిన ప్ర‌దేశంలో స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు క్వాలే కౌంటీ క‌మీష‌న‌ర్ ప్టీఫెన్ ఒరిండే తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 12 మంది ఉన్నారు. విమానం ఎందుకు, ఎలా కూలింద‌న్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. కాగా ప్రయాణం మధ్యలో వాతావరణ పరిస్థితులు ఆకస్మికంగా మారడంతో విమానం కొండప్రాంతం,అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది.విమానం మంటల్లో కాలి బూడిదైన స్థితిలో కనిపించిందని స్థానిక మీడియా పేర్కొంది.

క్వాలే కౌంటీ కమిషనర్ స్టీఫెన్ ఒరిండే ప్రకారం, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక దళాలు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 12 మంది ఉన్నారని, అందులో టూరిస్టులు మరియు సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తు అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది.

 Small Plane Crash in Kenya’s Kwale

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement