Snake Found in Plane: ఎయిరిండియా విమానంలో పాము కలకలం, దుబాయ్ ఎయిర్‌పోర్టులో గుర్తించిన సిబ్బంది, విచారణకు ఆదేశించిన డీజీసీఏ
దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్లేన్ లో పామును (Snake found) గుర్తించారు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్లిన B 737-800 ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన కార్గోలో (cargo) పాము కనిపించింది
Dubai, DEC 10: ఎయిరిండియా విమానంలో (Air India Express) పాము కలకలం సృష్టించింది. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్లేన్ లో పామును (Snake found) గుర్తించారు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్లిన B 737-800 ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన కార్గోలో (cargo) పాము కనిపించింది. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే విమానంలోకి పాము ఎలా వచ్చిందనే అంశంపై డీజీసీఏ విచారణకు ఆదేశించారు. పాము కారణంగా విమానంలోకి సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదని తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం తెలియరాలేదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)