South Africa Gas Leak: మురికివాడలో విష వాయువు లీక్, ఊపిరి ఆడక ముగ్గురు చిన్నారులు సహా 24 మంది మృతి

దక్షిణాఫ్రికా (South Africa)లో జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు.

Representative image. (Photo Credits: Unsplash)

దక్షిణాఫ్రికా (South Africa)లో జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. జోహెన్నస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ (Boksburg) సమీపంలో గల అనధికారిక సెటిల్ మెంట్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించే గ్యాస్ లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు.

ఘటన సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ సేవలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement