Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు, మహీంద, బాసిల్‌లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు

Sri Lanka PM Ranil Wickremesinghe (Photo-ANI)

శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్‌ జస్టిస్‌ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇక మహీంద, బాసిల్‌లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్‌ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now