Sri Lanka Crisis: మాజీ ప్రధాని రాజపక్స కుటుంబానికి సుప్రీంకోర్టు షాక్, ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు, వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని తెలిపిన ధర్మాసనం

former Prime Minister Mahinda Rajapaksa, Sri Lanka, Supreme Court, interim order preventing, Sri Lanka Crisis, శ్రీలంక, మాజీ ప్రధాని రాజపక్స, దేశ అత్యున్నత న్యాయస్థానం

Mahinda-Rajapaksa

శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్స కుటుంబానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ షాక్‌ ఇచ్చింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్‌ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్‌ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్‌లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now