Temple Vandalized in Canada: కెనడాలో హిందూ ఆలయాలపై దాడి, మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ కెనడా భాషలో రాతలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

‘హిందూస్థాన్‌ ముర్దాబాద్’ (Hindustan Murdabad), ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ (Declare Modi terrorist (BBC)) అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు.

Temple Vandalised With Anti-India Graffiti In Canada (Photo-Video Grab)

కెన‌డా (Canada )లో హిందూ ఆల‌యాల‌ (Hindu temples)పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మిస్సిసాగ‌లోని రామ మందిరం గోడ‌ల‌పై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలు, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్‌ మందిరంపై విద్వేష పూరిత వ్యాఖ్యలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు. ‘హిందూస్థాన్‌ ముర్దాబాద్’ (Hindustan Murdabad), ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ (Declare Modi terrorist (BBC)) అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలయం ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌లో (CCTV Footage) రికార్డయ్యాయి. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు విండ్సర్ పోలీసులు (Windsor police) వెల్లడించారు.ఈ మేరకు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)