California Floods: భారీ వరదలతో వణుకుతున్న అమెరికా, జలదిగ్భంధంలో చిక్కుకున్న కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
అగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు వణికిస్తున్నాయి.దేశంలోని కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు వణికిస్తున్నాయి.దేశంలోని కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
హాలీవుడ్ సినీ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని అధికారులు వెల్లడించారు. బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఈ నగరాన్ని వెంటనే వీడాలని అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. కాలిఫోర్నియాలో 17 ప్రాంతాల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాలిఫోర్నియాలో పలు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Here's Floods Videos