Tornado in Mississippi: అమెరికాను వణికించిన టోర్నడోలు, తుపాను బీభత్సం ధాటికి 23 మంది మృతి, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

అమెరికాలో టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు.

Representative Image

అమెరికాలో టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు.మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు చెప్పారు. ఈ టోర్నోడోల కారణంగా భారీ నష్టం జరిగిందని సుమారు 160 కి.మీ వరకు ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతం అక్కడ కూడా సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టినట్లు పేర్కొన్నారు.తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రంతా జనం అంధకారంలోనే మగ్గిపోయారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement