TV Debate Fight Video: లైవ్ టీవీ డిబెట్‌లో పిచ్చిపిచ్చిగా తన్నుకున్న నేతలు, పాకిస్థానీ టాక్ షో కల్ తక్ లైవ్ స్ట్రీమ్‌లో ఘటన, వీడియో ఇదిగో
ప్రముఖ పాకిస్థానీ టాక్ షో ‘కల్ తక్’ లైవ్ స్ట్రీమ్‌లో ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI)కి చెందిన షేర్ అఫ్జల్ మార్వత్, నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ కు చెందిన అఫ్నాన్ ఉల్లా ఈ షోలో పాల్గొన్నారు.
ప్రముఖ పాకిస్థానీ టాక్ షో ‘కల్ తక్’ లైవ్ స్ట్రీమ్‌లో ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI)కి చెందిన షేర్ అఫ్జల్ మార్వత్, నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ కు చెందిన అఫ్నాన్ ఉల్లా ఈ షోలో పాల్గొన్నారు. షోలో భాగంగా రాజకీయ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ పై అఫ్నాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశారని, మిలిటరీ అధికారులతో రహస్య చర్చలు జరిపారని ఆరోపించారు. అఫ్జల్ ఈ వాదనలు ఖండించాడు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా కాసేపటికి తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)