Two Earthquakes in Japan: జపాన్‌ సముద్ర తీరంలో గంటల వ్యవధిలో రెండు భూకంపాలు, భయంతో రోడ్ల మీదకు పరుగులు పెట్టిన ప్రజలు

మొదటి భూకంపం​ రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతో నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే(USGS) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

జపాన్‌ సముద్ర తీరంలో గురువారం గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం​ రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతో నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే(USGS) తెలిపింది. జపాన్‌లోని కురిల్ దీవుల్లో గురువారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మొదటి భూకంపం నమోదు కాగా, రెండో భూకంపం మధ్యాహ్నం 3.07 గంటల సమయంలో సంభవించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు భూకంపాలు సముద్రంతో 23.8 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపింది. అయితే రెండు సార్లు సంభవించిన ఈ భూకంపాల్లో ఎటువంటి ప్రాణ, ఆ‍స్తి నష్టం జరగలేదని ఆధికారులు వెల్లడిం‍చారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)