U.S. Raid in Syria: ఐఎస్ఐస్ అగ్ర‌నేత ఖురేషీని హతం చేసిన అమెరికా దళాలు, నార్త్ వెస్ట్ సిరియాలో అల్ ఖురేషీని మ‌ట్టుబెట్టామని తెలిపిన జోబైడెన్

ఐఎస్ఐఎస్‌ అగ్ర‌నేత అల్ ఖురేషీ ల‌క్ష్యంగా కౌంట‌ర్ టెర్ర‌రిజ‌మ్ ద‌ళాలు నార్త్ వెస్ట్ సిరియాలో దాడులు నిర్వ‌హించాయ‌ని, ఈ దాడుల్లోఅల్ ఖురేషీని మ‌ట్టుబెట్టాయ‌ని జోబైడెన్ ప్ర‌క‌టించారు.

Joe Biden (Photo Credits: IANS)

ఐఎస్ఐస్ అగ్ర‌నేత అబు ఇబ్ర‌హీమ్ అల్ ఖురేషీని అమెరికా ద‌ళాలు మ‌ట్టుబెట్టామని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఐఎస్ఐఎస్‌ అగ్ర‌నేత అల్ ఖురేషీ ల‌క్ష్యంగా కౌంట‌ర్ టెర్ర‌రిజ‌మ్ ద‌ళాలు నార్త్ వెస్ట్ సిరియాలో దాడులు నిర్వ‌హించాయ‌ని, ఈ దాడుల్లోఅల్ ఖురేషీని మ‌ట్టుబెట్టాయ‌ని జోబైడెన్ ప్ర‌క‌టించారు. అయితే ఈ దాడిలో అమెరికా సైనికులు క్షేమంగానే ఉన్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఎంతో ధైర్య సాహ‌సాల‌తో ఈ దాడుల‌కు అమెరికా ద‌ళాలు పూనుకున్నాయ‌ని, వారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని జోబైడెన్ పేర్కొన్నారు. ‘మా సాయుధ ద‌ళాల నైపుణ్యానికి, ధైర్యానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. ఐఎస్ఐఎస్ అగ్ర‌నేత అల్‌ఖురేషీని అమెరిక‌న్ ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న అమెరికా సైనికులంద‌రూ తిరిగి క్షేమంగా తిరిగి వ‌చ్చారు’ అని అమెరిక‌న్ ప్రెసిడెంట్ జోబైడెన్ పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)