Ugandan Minister Shot Dead: జీతం ఇవ్వలేదని దేశ మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డు, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించిన ఉగాండా దేశ కార్మిక శాఖ సహాయమంత్రి చార్లెస్‌ ఎంగోలా

ఉగాండా రాజధాని కంపాలా (Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ (Retired Colonel ) చార్లెస్‌ ఎంగోలా (Charles Engola) నివాసంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ వివాదంలో ఆయన వద్ద పనిచేసే బాడీగార్డు మంత్రిని కాల్చి చంపాడు.

Representational Image (File Photo)

ఉగాండా రాజధాని కంపాలా (Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ (Retired Colonel ) చార్లెస్‌ ఎంగోలా (Charles Engola) నివాసంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ వివాదంలో ఆయన వద్ద పనిచేసే బాడీగార్డు మంత్రిని కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అంగరక్షకుడు సైతం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు.

అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని గార్డు కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు ఏమిటనేది దర్యాప్తులో తేలుతుందని ఆర్మీ ప్రతినిధి (army spokesperson) ఫెలిక్స్‌ కులాయిగ్వే ( Felix Kulayigye) పేర్కొన్నారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement