US Bridge Collapse Video: అమెరికాలో నౌక ఢీకొన‌డంతో న‌దిలో కుప్పకూలిన బ్రిడ్జ్‌, పలు వాహనాలతో పాటు వ్యక్తులు గల్లంతు, ప్ర‌మాదానికి చెందిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ బోటు ఢీకొట్ట‌డంతో కుప్పకూలిపోయింది(Bridge Collapse). మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌టాప‌స్కో న‌దిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను సింగ‌పూర్ జెండాతో ప్రయాణిస్తున్న భారీ నౌక ఢీకొట్టింది. బాల్టిమోర్ నుంచి దాలి అనే పేరు గల ఆ నౌక శ్రీలంక‌లోని కొలంబోకు వెళ్తున్న‌ది.

Francis Scott Key Bridge in Baltimore Collapses After Container Ship Hits It, Dramatic Video

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ బోటు ఢీకొట్ట‌డంతో కుప్పకూలిపోయింది(Bridge Collapse). మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌టాప‌స్కో న‌దిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను సింగ‌పూర్ జెండాతో ప్రయాణిస్తున్న భారీ నౌక ఢీకొట్టింది. బాల్టిమోర్ నుంచి దాలి అనే పేరు గల ఆ నౌక శ్రీలంక‌లోని కొలంబోకు వెళ్తున్న‌ది.

బ్రిడ్జ్‌కు చెందిన అన్ని లేన్ల‌ను మూసివేసిన‌ట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేష‌న్ అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను మ‌రో వైపు మ‌ళ్లించారు. ఏడు మందితో పాటు ఏడు వాహ‌నాలు బ్రిడ్జ్ కూలిన స‌మ‌యంలో న‌దిలో ప‌డిన‌ట్లు బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌మాదానికి చెందిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. భారీ భూకంపం ధాటికి 5 మంది మృతి, వేయికు పైగా ఇళ్లు ధ్వంసం, పపువా న్యూగినియాలో 6.9 తీవ్రతతో విరుచుకుపడిన భూకంపం

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now