Monkeypox Outbreak: అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్, ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్రకటించిన బైడెన్ సర్కారు, అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు

అమెరికాలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్క‌డ ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగ‌వంతం చేయ‌నున్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో మూడ‌వ వంతు కేసులు న్యూయార్క్‌లో బ‌య‌ట‌ప‌డ్డాయి.

Monkeypox in India (Photo-ANI)

అమెరికాలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్క‌డ ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగ‌వంతం చేయ‌నున్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో మూడ‌వ వంతు కేసులు న్యూయార్క్‌లో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ రాష్ట్రం స్వంతంగా ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు న‌మోదు అయ్యాయి. ఈ ఏడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా 26వేల కేసులు న‌మోదు అయిన‌ట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement