US Student Visas: ఉన్నత చదువులకు అమెరికాకు భారీ స్థాయిలో భారతీయ విద్యార్థులు, మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
ఈ వేసవిలో (జూన్, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి వెళ్లాలనుకునేవారికి ఈ ఏడాది భారీ స్థాయిలో వీసాలు మంజూరు చేసింది అమెరికా. ఈ వేసవిలో (జూన్, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది. అమెరికాలో చదువుకోసం ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌లోనే ఉంటుందని తెలిపింది.
ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్‌వర్క్, సాంకేతికత సహాయంతో.. అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది. గతేడాది మొత్తంగా 1.25 లక్షల మందికి అమెరికా విద్యార్థి వీసాలు (Student visa) జారీ చేయగా.. వేసవిలో 82 వేల మందికి వీసాలను అందించింది. అమెరికాలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)