US Mass Shooting: అమెరికాలో 10 మందిపై కాల్పులకు తెగబడిన 16 ఏళ్ల బాలుడు, యువకుడిని అదుపులోకి తీసుకున్న ఫ్లోరిడా పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఓ పార్టీ (Florida party)లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఓర్లాండోకు ఉత్తరాన 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్‌ఫోర్డ్ (Sanford)లోని కాబానా లైవ్ (Cabana Live)లో అర్ధరాత్రి ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఆ సమయంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది
అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఓ పార్టీ (Florida party)లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఓర్లాండోకు ఉత్తరాన 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్‌ఫోర్డ్ (Sanford)లోని కాబానా లైవ్ (Cabana Live)లో అర్ధరాత్రి ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఆ సమయంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలుడు గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడినట్లు సెమినోల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించింది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement