US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం, 5 మంది మృతి, మరో ఆరుగురికి గాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్‌లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్‌లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కుటుంబ వివాదాల కారణంతో నిందితుడి భార్య కొంతకాలంగా అతన్ని దూరం పెట్టినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యను లక్ష్యంగా చేసుకుని ట్రబుకో కాన్యన్‌లోని కార్నర్ బార్‌లో కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)