US President Joe Biden: వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. రిపోర్టపై నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తర్వాత ఫోన్ చేసి క్షమాపణలు చెప్పిన అమెరికా అధినేత
వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. అంటూ నోరు జారారు. అయితే ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉంది. కానీ అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో.. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. రిపోర్టర్ పీటర్ డూసీపై బైడెన్ నోరు జారినట్లు తెలుసుకున్న తర్వాత అందరూ షాకయ్యారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు. వైట్‌హౌజ్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు.మధ్యంతర ఎన్నికల వేళ.. ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యతగా భావిస్తారా అని వైట్‌హౌజ్ కరస్పాండెంట్ అడిగారు. దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు. ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అంటూనే.. ప్రశ్న వేసిన జర్నలిస్టును తిట్టేశారు.
వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. అంటూ నోరు జారారు. అయితే ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉంది. కానీ అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో.. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. రిపోర్టర్ పీటర్ డూసీపై బైడెన్ నోరు జారినట్లు తెలుసుకున్న తర్వాత అందరూ షాకయ్యారు. ఆ ఘటన జరిగిన గంట తర్వాత బైడెన్ ఆ రిపోర్టర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్‌గా తీసుకోవద్దు అంటూ బైడెన్ కోరారని పీటర్ తెలిపాడు.