US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురు మృతి, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌ు, వాషింగ్టన్‌ డీసీలోని బేస్‌బాల్‌ స్టేడియం వెలుపల కాల్పులకు తెగబడిన దుండుగులు

ఈ ఘట‌న‌లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

Image used for representational purpose only (Photo Credits: Getty)

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఓ వ్య‌క్తి 12 రౌండ్లు కాల్పులు జ‌రిపి క‌ల‌క‌లం రేపాడు. ఈ ఘట‌న‌లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్‌లోని నేషనల్స్‌ పార్క్‌ బేస్‌బాల్ మైదానంలో మ్యాచ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాల్పుల చ‌ప్పుడు విన‌ప‌డ‌గానే కొందరు ప్రేక్షకులు మైదానం నుంచి బయటకు పరుగులు తీయ‌గా, ఆటగాళ్లు కూడా పిచ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కాల్పులకు తెగబడిన వ్య‌క్తికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అధికారులు చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)