US, UK Strikes on Houthi Targets: హౌతీ రెబల్స్‌ పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాల ప్రతీకారం.. యెమెన్‌ లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం

ప్రపంచ దేశాల వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న హౌతీలపై శుక్రవారం ప్రతీకార దాడులు చేశాయి.

US, UK Strikes on Houthi Targets (Credits: X)

Newyork, Jan 12: ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌(Houthi Rebels) పై అమెరికా (America), బ్రిటన్‌ (Britain) సైన్యాలు కన్నెర్రజేశాయి. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న హౌతీలపై శుక్రవారం ప్రతీకార దాడులు చేశాయి. యెమెన్‌ లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధనౌక నుంచి టొమాహాక్‌ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. లాజిస్టిక్‌ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్‌ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..