Hijab Row: వీడియో ఇదిగో, హిజాబ్ ధరించలేదని మహిళల తలపై పెరుగు పోసిన యువకుడు, నిందితుడుతో పాటు మహిళలిద్దర్నీ అరెస్ట్ చేసిన ఇరాన్ పోలీసులు
ఇరాన్ మహిళలు (Iranian Women ) తప్పనిసరిగా హిజాబ్ (Hijab) ధరించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.దీనిని పాటించని వారిపై కఠిన చర్యలు చేపడుతున్నది.తాజాగా ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకుండా ఒక షాప్ వద్దకు వెళ్లగా.. అక్కడ ఉన్న యువకుడు ఆగ్రహంతో ఆ షాప్‌లోని ర్యాక్‌లో ఉన్న పెద్ద పెరుగు కప్‌ను తీసుకుని ఆ మహిళల తలపై పోశాడు.
ఇరాన్ మహిళలు (Iranian Women ) తప్పనిసరిగా హిజాబ్ (Hijab) ధరించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.దీనిని పాటించని వారిపై కఠిన చర్యలు చేపడుతున్నది.తాజాగా ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకుండా ఒక షాప్ వద్దకు వెళ్లగా.. అక్కడ ఉన్న యువకుడు ఆగ్రహంతో ఆ షాప్‌లోని ర్యాక్‌లో ఉన్న పెద్ద పెరుగు కప్‌ను తీసుకుని ఆ మహిళల తలపై పోశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సంఘటనపై ఇరాన్ పోలీసులు స్పందించారు. హిజాబ్ ధరించని ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. అలాగే పబ్లిక్ ఆర్డర్‌కు విఘాతం కలిగించినందుకు మహిళలపై పెరుగుతో దాడి చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. హిజాబ్ ధరించని మహిళలను షాపులోకి అనుమతించడంతోపాటు ఆ చట్టాన్ని పాటించనందుకు ఆ షాపు యజమానికి నోటీసులు జారీ చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)