IPL Auction 2025 Live

Kim Jong Un Crying Video: జనాభా తగ్గిపోతోంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత కిమ్, వీడియో ఇదిగో...

దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోందని దయచేసి మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు.కాగా ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది.

Kim Jong Un CRIES (photo-Video Grab)

దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోందని దయచేసి మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు.కాగా ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది.

ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ సంచలన నివేదిక తెలిపింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది.దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్‌ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)