Heart-warming Video: గుండెల్ని హత్తుకునే వీడియో తప్పక చూడండి, సైన్యంలో పోరాడుతున్న భర్తను 30 వారాల తర్వాత చూసి కన్నీరు పెట్టుకున్న గర్భవతైన ఉక్రెయిన్ మహిళ
ఉక్రెయిన్‌లో గుండెను హత్తుకునే వీడియో వెలుగులోకి వచ్చింది. దేశం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుడు చాలా కాలం తర్వాత గర్భవతిగా ఉన్న తన భార్యను కలుసుకుంటున్నట్లుగా వీడియోలో ఉంది. అంటోన్ గెరాష్చెంకో అనే ట్విటర్ అకౌంట్‌లో అ వీడియో పోస్టు చేశారు.
ఉక్రెయిన్‌లో గుండెను హత్తుకునే వీడియో వెలుగులోకి వచ్చింది. దేశం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుడు చాలా కాలం తర్వాత గర్భవతిగా ఉన్న తన భార్యను కలుసుకుంటున్నట్లుగా వీడియోలో ఉంది. అంటోన్ గెరాష్చెంకో అనే ట్విటర్ అకౌంట్‌లో అ వీడియో పోస్టు చేశారు. ఇందులో గర్భిణీగా ఉన్న మహిళ ఉక్రెయిన్ సైనికుడైన తన భర్తకు కలవడానికి ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది.యూనిఫాం ధరించిన భర్తను చూడగానే అతన్ని గట్టిగా హత్తుకుంటుంది.
భర్తను కలిసిన ఆనందంలో మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం చూడవచ్చు.దీనికోసమే మేయు యుద్ధంతో పోరాడుతున్నాం. ఈ సంతోషమే మాకు కావాల్సింది. వారు 30 వారాలుగా ఒకరినొకరు చూసుకోలేదు. ఎట్టకేలకు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సందర్భం రానేవచ్చింది’ అనే క్యాష్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)