Super Typhoon Hinnamnor Moving Video: షాకింగ్ వీడియో, అత్యంత శక్తివంతమైన తుఫాన్ ఎలా కదులుతుందో చూశారా, దక్షిణాసియా దేశాలను వణికిస్తోన్న హిన్నమ్నోర్
జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది.
2022లో అత్యంత శక్తివంతమైన ఉష్ణ మండల తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్ దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి.ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో.. గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది.హిన్నమ్నోర్ కదులుతున్న వీడియో ఇదే..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)