Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌లో 81 పతకాలతో భారత్ ఆల్ టైం రికార్డు, పాత రికార్డులను బద్దలు కొట్టిన ఇండియా అథ్లెట్ల బృందం, పతాకల పట్టికలో నాలుగో స్థానం

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.

Neeraj Chopra, and r Kishore Jena (Photo-X)

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. మెన్స్‌ 4×400 మీటర్స్‌ రిలేలో బంగారు పతకం దక్కింది. దాంతో పసిడి పతకాల సంఖ్య 18కి చేరింది.

అదేవిధంగా ఉమెన్స్‌ 4×400 మీటర్స్‌ రిలేలో కూడా భారత్‌కు రజతం దక్కింది. ఇక 35 కిలోమీటర్ల రేసు వాక్‌ మిక్స్‌డ్‌ టీమ్స్‌ ఫైనల్‌లో భారత్‌ కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టాడు. మరో జావెలిన్‌ త్రోయర్‌ కిషోర్‌ కుమార్‌ జెనా ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రజత పతకం నెగ్గాడు.

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో  మహిళలు రజత పతకం కైవసం

పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్‌లో 70 పతకాలు) అధిగమించిన భారత్‌.. నీరజ్‌, ఫురుషుల రిలే టీమ్‌ స్వర్ణాలతో ఏషియన్‌ గేమ్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్‌ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్‌ స్వర్ణాల విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్‌ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం

మెన్స్‌ రిలే టీమ్‌ స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్‌, 94 సిల్వర్‌, 51 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్‌ 147 మెడల్స్‌తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif