BWF World Championship 2021: వరల్డ్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధుకు నిరాశ, క్వార్టర్స్ లోనే వెనుదిరిగిన డిఫెండింగ్ చాంపియన్, తైవాన్ ప్లేయర్ చేతిలో ఓటమి
స్పెయిన్(Spain)లో జరుగుతున్న పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ సింధు క్వార్టర్స్(quarter final) లో తైవాన్ క్రీడాకారిణి తై జూ యింగ్(Tai Tzu-ying ) చేతిలో 21-17, 21-13 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
Huelva December 18: బీడబ్లూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్(BWF World Championship) నుంచి పీవీ సింధు(PV Sindhu) నిష్క్రమించింది. స్పెయిన్(Spain)లో జరుగుతున్న పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ సింధు క్వార్టర్స్(quarter final) లో తైవాన్ క్రీడాకారిణి తై జూ యింగ్(Tai Tzu-ying ) చేతిలో 21-17, 21-13 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
తొలి గేమ్‌ను తై యింగ్(Tai Tzu-ying ) 21-17 స్కోర్‌తో సునాయాసంగా సొంతం చేసుకున్నది. గట్టి పోటీ ఇచ్చిప్పటికీ ప్రత్యర్థి దూకుడు ముందు సింధు(PV Sindhu) నిలువలేకపోయింది. ఇక రెండవ సెట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. కానీ చివర్లో తైవాన్ ప్లేయర్ తై యింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి రెండవ గేమ్‌ను కూడా 21-13 తేడాతో గెలుచుకున్నది. కేవలం 42 నిమిషాల్లో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నది.
స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21-14, 21-18తో పోర్న్‌పవీ చొచువాంగ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 48 నిమిషాల్లో ఆ మ్యాచ్‌ను సింధు సొంతం చేసుకుంది. కానీ క్వార్టర్స్‌లో మాత్రం తై యింగ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.