Sachin Tendulkar Birthday Special: క్రికెట్ గాడ్ పుట్టిన రోజు సందర్భంగా బీసీసీఐ విషెస్, మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డులు సచిన్ టెండూల్కర్ సొంతం, సచిన్ పేరిట ఉన్న రికార్డులెన్నంటే?
664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో 34,357 పరుగులు చేసినట్లు గుర్తు చేసింది. 201 వికెట్లు తీసినట్లు తెలిపింది. అదేవిధంగా 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయ మ్యాచుల్లో 100 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ అని కొనియాడింది.
Mumbai, April 23: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పుట్టిన రోజు నేడు. కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో కొలువుదీరిన ఈ క్రికెట్ గాడ్.. నేటితో 51వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచిన్‌కు పుట్టినరోజు (Sachin Tendulkar Birthday) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, పలువురు ప్రముఖులు సచిన్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సచిన్‌కు ఎక్స్ వేదిగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes To Sachin Tendulkar) తెలియజేసింది.
సచిన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ విషెస్ తెలిపింది. 664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో 34,357 పరుగులు చేసినట్లు గుర్తు చేసింది. 201 వికెట్లు తీసినట్లు తెలిపింది. అదేవిధంగా 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయ మ్యాచుల్లో 100 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ అని కొనియాడింది. క్రికెట్ లెజెండ్‌కు ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.