DC vs SRH Highlights: ఎట్టకేలకు హైదరాబాద్‌కు దక్కిన విక్టరీ, సొంతగడ్డపై ఢిల్లీ కేపిటల్స్‌కు పరాభవం, ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు మూడో విక్టరీ
లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితం కావడంతో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
New Delhi, April 29: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితం కావడంతో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (63; 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు), ఫిల్ సాల్ట్(59; 35 బంతుల్లో 9 ఫోర్లు) లు అర్ధశతకాలతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, అకేల్ హోసేన్, అభిషేక్ శర్మ ఒక్కొ వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(67; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్ ; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) అర్ధశతకాలతో రాణించాడు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు మూడో విజయం. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచులో విజయం సాధిస్తేనే సన్ రైజర్స్ ప్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.