IPL 2021: అయోమంలో అప్ఘాన్ క్రికెటర్లు, రషీద్ ఖాన్, నబీలు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని తెలిపిన సన్‌రైజర్స్, తమ దేశాన్ని కాపాడాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన స్పిన్నర్ రషీద్ ఖాన్
తమ టీమ్‌కు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ మాత్రం యూఏఈలో జరిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SRH CEO) సోమవారం ప్రకటించింది.
అఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి క్రికెటర్ల (Afghanistan Cricketers) భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఆ దేశం నుంచి నుంచి ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్ గా ఎదిగి అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రషీద్ ఖాన్, మరో స్టార్ ఆటగాడు మహ్మద్ నబీ (Rashid Khan and Mohammad Nabi) లాంటి ఆటగాళ్ళు అయోమయానికి గురవుతున్నారు.
వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌లో వీళ్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది. అయితే తమ టీమ్‌కు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ మాత్రం యూఏఈలో జరిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SRH CEO) సోమవారం ప్రకటించింది.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో టీమ్ సీఈవో షణ్ముగం మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదానిపై మేము మాట్లాడలేదు. కానీ వాళ్లు మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు అని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 31న తమ టీమ్ యూఏఈకి బయలుదేరుతోందని షణ్ముగం వెల్లడించారు. ప్రస్తుతం రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు.
అయితే తన కుటుంబాన్ని ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎలా బయటపడేయాలన్నదానిపై రషీద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చెప్పాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రస్తుతం రషీద్ ట్రెంట్ రాకెట్స్‌కు, నబీ లండన్ స్పిరిట్స్‌కు ఆడుతున్నారు. యుకే లో టోర్నీ ముగిశాక కూడా రషీద్, నబీ అక్కడే వుంటే మన వాళ్లతో కలిపి ఒకే విమానంలో తీసుకువచ్చే ప్రయత్నం బీసీసీఐ చేయాలని భావిస్తోంది. రషీద్, నబీ ఇద్దరూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Here's Rashid Khan Tweet
ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై అక్కడి క్రికెట్ బోర్డుతో బీసీసీఐ మాట్లాడుతామని తెలిపింది. ఇప్పటికే తమ దేశాన్ని రక్షించాలంటూ రషీద్ ఖాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై అక్కడి క్రికెట్ బోర్డుతో బీసీసీఐ మాట్లాడనుంది. అంతేకాదు ఈ నెలలోనే ఆఫ్ఘనిస్థాన్ టీమ్ శ్రీలంక టూర్ కూడా వెళ్లాల్సి ఉంది.