BCCI Media Rights Auction: ఒక్క మ్యాచ్‌కు కనీసం రూ. 60 కోట్లు, మీడియా రైట్స్ తో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్న బీసీసీఐ, హక్కుల కోసం భారీ పోటీ
ఈ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురవబోతుంది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం (BCCI Media Rights Auction) గురువారం జరుగనుంది. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్ (Disney), సోనీ (Sony), వయాకామ్18 (Viacom18 eye Digital) పోటీలో ఉన్నాయి.
Mumbai, AUG 31: మరోసారి బీసీసీఐ (BCCI) పంట పండనుంది. ఈ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురవబోతుంది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం (BCCI Media Rights Auction) గురువారం జరుగనుంది. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్ (Disney), సోనీ (Sony), వయాకామ్18 (Viacom18 eye Digital) పోటీలో ఉన్నాయి. ఈ ముక్కోణపు పోటీ కారణంగా మ్యాచ్‌కు కనీసం రూ.60 కోట్ల ధర పలుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. కానీ అది రూ.100 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డిస్నీ స్టార్, సోనీ, వయాకామ్18 సాంకేతిక బిడ్లు దాఖలు చేశాయి.
Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం
డిజిటల్, టీవీ హక్కులకు వేర్వేరుగా బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీని కోసం వరుసగా మ్యాచ్‌కు టీవీకి రూ.20 కోట్లు, డిజిటల్‌కు 25 కోట్ల నుంచి వేలం ప్రారంభం కానుంది. కానీ ఒక్కో మ్యాచ్‌కు రూ.60 కోట్లకు చేరకపోతే ఈ వేలం చెల్లదని బీసీసీఐ (BCCI) ప్రకటించనున్నట్లు తెలిసింది. ఐపీఎల్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న వయాకామ్18 ఇప్పుడు భారత జట్టు డిజిటల్ హక్కులపైనా కన్నేసింది. ఇక టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్, సోనీ పోటాపోటీగా తలపడే అవకాశముంది. ఈ అయిదేళ్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది.