India vs Sri Lanka New Schedule: భారత్‌, శ్రీలంక టీ20, వన్డే సిరీస్‌ కొత్త షెడ్యూల్, ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం, 25, 27, 29న టీ20లు, కోవిడ్ నుంచి కోలుకున్న లంక ఆటగాళ్లు

కరోనావైరస్ నేపథ్యంలో తొలుత విడుదల చేసిన షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా లంక ఆటగాళ్లు కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సవరించిన షెడ్యూల్‌ను (India vs Sri Lanka New Schedule) సోమవారం ప్రకటించింది.

India white-ball squad (Photo/ BCCI Twitter)

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య త్వరలో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌కు (IND vs SL) కొత్త షెడ్యూల్ వచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో తొలుత విడుదల చేసిన షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా లంక ఆటగాళ్లు కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సవరించిన షెడ్యూల్‌ను (India vs Sri Lanka New Schedule) సోమవారం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుందని, అయితే స్వల్ప సమయ మార్పులు జరిగాయని తెలిపింది.

సాధారణంగా జులై 18, 20, 23న జరిగే వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:30 నిముషాలకు జరగాల్సి ఉందని, అయితే అరగంట ఆలస్యంగా 3 గంటలకు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.ఇక 25, 27, 29న జరిగే టీ20లు కూడా ముందుగా అనుకున్నట్లు 7 గంటలకు కాకుండా రాత్రి 8 గంటలకు ప్రారంభిస్తున్నట్లు వెల్లడిచింది. ట్విటర్‌ వేదికగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటిచింది. ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకొని శ్రీలంక జట్టు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ను కలిసిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపిన వైసీపీ పార్టీ

Here's Match's New Schedule

స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భారత్-శ్రీలంక టోర్నీ వాయిదా పడింది. ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు 18కి వాయిదా పడ్డాయి.