CSK vs SRH Highlights: హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఓటములు, సొంతగ్రౌండ్‌లో చెలరేగిన చెన్నై బౌలర్లు, బ్యాట్స్‌మెన్, ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం
ఈ సీజన్ లో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Chennai, April 21: ఐపీఎల్‌లో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఓటములు కొనసాగుతున్నాయి. ఈ సీజన్ లో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది.చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే(77 నాటౌట్; 57 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా రుతురాజ్ గైక్వాడ్(35; 30 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు.
అంతకుముందు చెన్నై బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ 134 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత డెవాన్ కాన్వే(77 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్(35) దంచారు. మోయినీ అలీ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దాంతో, మర్‌క్రం సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నాలుగు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మహీశ్ థీక్షణ తలా ఒక వికెట్ తీశారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), హ్యారీబ్రూక్(18) తక్కువకే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి(21) రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. కెప్టెన్ ఏయిడెన్ మర్‌క్రం(12), మయాంక్ అగర్వాల్(2) విఫలమయ్యారు. ఆఖర్లలో హెన్రిచ్ క్లాసెన్(17), మార్కో జాన్‌సెన్(17) పోరాడడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేసింది.