IPL Auction 2025 Live

DC vs KKR Highlights IPL 2020: ఆడేసుకున్న అయ్యర్, మరోసారి విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌, పోరాడకుండానే ఓడిన కోలకతా నైట్ రైడర్స్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఢిల్లీ

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (DC vs KKR Highlights IPL 2020) ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. పాయిట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్టించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది.

Delhi Capitals vs Kolkata Knight Riders. (Photo Credits: Twitter|@DelhiCapitals)

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి సత్తాచాటింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (DC vs KKR Highlights IPL 2020) ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. పాయిట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్టించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది.

కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(38 బంతుల్లో 88; 7ఫోర్లు, 6సిక్స్‌లు), ఓపెనర్‌ పృథ్వీ షా(41 బంతుల్లో 66; 4ఫోర్లు, 4సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో పాటు రిషబ్‌ పంత్‌(17 బంతుల్లో 38; 5 ఫోర్లు, ఓ సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. కోల్‌కతా బౌలర్లలో అండ్రీ రసెల్‌కు రెండు, వరుణ్‌ చక్రవర్తి, నాగర్‌కోటికి చెరో వికెట్‌ దక్కగా.. స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ వికెట్‌ లేకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు.

భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా (Kolkata Knight Riders) ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. నితీశ్‌ రాణా(35 బంతుల్లో 58; 4ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకం సాధించగా ఇయాన్‌ మోర్గాన్‌ (16 బంతుల్లో 36; ఓ ఫోర్‌, ఐదు సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకపోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులకే కోలకతా పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లతో రాణించారు. బ్యాటింగ్‌లో అదగరొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

పోరాడి వరుసగా రెండోసారి గెలిచిన హైదరాబాద్, ముచ్చటగా మూడోసారి పరాజయాన్ని మూటగట్టుకున్న చెన్నై, సీఎస్‌కేని గెలిపించలేకపోయిన జడేజా అర్థ సెంచరీ

స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) శభ్‌మన్‌ గిల్‌ (బి) నాగర్‌కోటి 66, ధవన్‌ (సి) మోర్గాన్‌ (బి) 26, శ్రేయస్‌ (నాటౌట్‌) 88, పంత్‌ (సి) మావి (బి) రసెల్‌ 38, స్టొయినిస్‌ (సి) చక్రవర్తి (బి) రసెల్‌ 1, హెట్మైర్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 20 ఓవర్లలో 228/4. వికెట్ల పతనం: 56-1, 129-2, 201-3, 221-4. బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-49-0, మావి 3-0-40-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-49-1, నరైన్‌ 2-0-26-0, రసెల్‌ 4-0-29-2, 3-0-35-1.

కోల్‌కతా: గిల్‌ (సి) పంత్‌ (బి) మిశ్రా 28, నరైన్‌ (బి) నోర్జే 3, రాణా (సి) (సబ్‌) అక్షర్‌ (బి) హర్షల్‌ 58, రస్సెల్‌ (సి) నోర్జే (బి) రబాడ 13, కార్తీక్‌ (సి) ధావన్‌ (బి) హర్షల్‌ 6, మోర్గాన్‌ (సి) హెట్‌మైర్‌ (బి) నోర్జే 44, కమిన్స్‌ (సి) హర్షల్‌ (బి) నోర్జే 5, త్రిపాఠి (బి) స్టొయినిస్‌ 36, నాగర్‌కోటి (నాటౌట్‌) 3, శివమ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 210/8. వికెట్ల పతనం: 1-8, 2-72, 3-94, 4-117, 5-117, 6-122, 7-200, 8-207, బౌలింగ్‌: రబాడ 4-0-51-1, నోర్జే 4-0-33-3, అశ్విన్‌ 2-0-26-0, స్టొయినిస్‌ 4-0-46-1, హర్షల్‌ 4-0-34-2, మిశ్రా 2-0-14-1.