DC vs KXIP Highlights: రెండో మ్యాచ్‌కే సూపర్ ఓవర్, ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌దే గెలుపు, ఢిల్లీ తరపున చెలరేగిన స్టొయినిస్, పంజాబ్ తరపున మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం
రెండో మ్యాచ్‌కే సూపర్ ఓవర్ వచ్చేసింది. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ (Delhi Capitals vs Kings XI Punjab) సాధించింది. పంజాబ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ బౌలర్ రబడ మెరుపులు మెరిపించాడు. బౌలింగ్ సత్తాతో కింగ్స్‌ను ఓడించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (21 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు.
ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరుపులు మెరుస్తున్నాయి. రెండో మ్యాచ్‌కే సూపర్ ఓవర్ వచ్చేసింది. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ (Delhi Capitals vs Kings XI Punjab) సాధించింది. పంజాబ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ బౌలర్ రబడ మెరుపులు మెరిపించాడు. బౌలింగ్ సత్తాతో కింగ్స్‌ను ఓడించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (21 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు.
కింగ్స్ బౌలర్లలో షమీ 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. మయాంక్ అగర్వాల్ (60 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కానీ తమ జట్టును ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయాడు.
ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC vs KXIP) సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో గెలుపును అందుకుంది. సూపర్ ఓవర్‌లో కింగ్స్ పంజాబ్ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. ఈ మూడు పరుగుల్ని ఢిల్లీ సునాయసంగా సాధించి తాము ఫేవరెట్ జట్లలో ఒకటని నిరూపించుకుంది. కింగ్స్ పంజాబ్ ఆడిన సూపర్ ఓవర్‌లో రాహుల్ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. రబడా వేసిన రెండో బంతికి రాహుల్ ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి పూరన్ బౌల్డ్ అయ్యాడు. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే అక్కడితో ఒక జట్టు ఇన్నింగ్స్ ముగుస్తుంది. దాంతో కింగ్స్ మూడు పరుగుల్ని మాత్రమే ఢిల్లీకి నిర్దేశించింది. ఢిల్లీ ఆడిన సూపర్ ఓవర్‌లో ఓపెనర్‌గా దిగిన పంత్ రెండు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్(21; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మోహిత్ శర్మ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి రాహుల్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కరుణ్ నాయర్, పూరన్‌లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. ఆపై మ్యాక్స్‌వెల్(1) కూడా ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లలో కింగ్స్ పంజాబ్ సగం వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. ఒకవైపు ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ క్రీజ్‌లో ఉండగానే వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు పెవిలియన్ చేరడంతో కింగ్స్ పంజాబ్ ఒత్తిడిలోకి వెళ్లింది.
కింగ్స్‌కు ఓటమి ఖాయమనుక్ను తరుణంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకొచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా వన్ మ్యాన్ షో జట్టును ఆదుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. అయితే గెలుపు ఖాయమనుక్ను తరుణంలో చివరి ఓవర్‌లో కింగ్స్‌కు 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులు చేసిన తర్వాత మయాంక్ క్యాచ్‌కు దొరికేయడంతో మ్యాచ్‌పై ఒక్కసారిగా ఉత్కంఠను రేగింది. కాగా, చివరి బంతికి జోర్డాన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై అయ్యింది. చివరి ఓవర్‌లో స్టోయినిస్ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను టైగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఢిల్లీ కష్టాల్లో పడ్డ సమయంలో స్టోయినిస్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు. . 20 బంతుల్లో సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించి హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఢిల్లీ స్కోరు బోర్డును 150 పరుగులు దాటింది.