DC vs RR: చెత్తగా ఆడి ఓడిన రాజస్థాన్, 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లే అప్‌కు చేరువగా నిలిచిన ఢిల్లీ
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
దుబాయ్‌లోని అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం (DC vs RR Stat Highlights IPL 2021) సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ సంజూ శాంసన్( 69, 52 బంతులు; 8 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 19 పరుగులు చేశాడు. కాగా శాంసన్ తన మెరుపులతో ఒంటరి పోరాటం చేసినప్పటికి... మిగతా బ్యాట్స్‌మన్ సహకారం కరువైంది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులకు నలుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అన్‌రిచ్ నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్,అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ 43 పరుగులతో (Shreyas Iyer Help Delhi Capital) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. రెండు ఓటములతో 16 పాయింట్లు సాధించి టాప్ పొజీషన్‌కు చేరుకొని ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్తాన్ ఓటమితో 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒక్క బౌండరీ లేకుండా పవర్ ప్లే ముగియడం ఐపీఎల్‌లో 2011 తర్వాత ఇది రెండోసారి మాత్రమే. 2011లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది.
ఢిల్లీ బ్యాటింగ్
పృథ్వీ షా 10, ధవన్ 8, శ్రేయస్ అయ్యర్ 43, పంత్ 24, హెట్మెయిర్ 28, లలిత్ యాదవ్ 14, అక్షర్ పటేల్ 12, అశ్విన్ 6*, ఎక్స్ ట్రాలు 9
రాజస్థాన్ బౌలింగ్
ముస్తాఫిజుల్ 2 వికెట్లు, చేతన్ సకారియా 2 వికెట్లు, కార్తిక్ త్యాగి 1 వికెట్, రాహుల్ తివాతియా 1 వికెట్
రాజస్థాన్ బ్యాటింగ్
లివింగ్ స్టోన్ 1, యశస్వి జైస్వాల్ 5, సంజు శాంసన్ 70*, మిల్లర్ 7, మహిపాల్ లామ్రోర్ 19, రియాన్ పరాగ్ 2, రాహుల్ తివాతియా 9
ఢిల్లీ బౌలింగ్
అన్‌రిచ్ నార్ట్జ్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్ 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్, అశ్విన్ 1 వికెట్