PBKS vs RR, IPL 2021: చివరి ఓవర్ డ్రామాలో త్యాగి మ్యాజిక్, బోల్తాపడిన పంజాబ్, 2 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్
Kartik Tyagi (Photo Credits: Twitter)

ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో (PBKS vs RR, IPL 2021) రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ దారుణంగా బోల్తా పడింది.పంజాబ్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాలి. 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్‌ జట్టు... కార్తీక్‌ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో (Karthik Tyagi’s Last Over Heroics ) గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్‌ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది. చివరకు 2 పరుగుల తేడాతో (Rajasthan Royals to a 2-Run Win) రాజస్తాన్‌ రాయల్స్‌ అనూహ్య విజయాన్నందుకుంది.

ముందుగా రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్‌ లూయిస్‌ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. మయాంక్‌ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు), రాహుల్‌ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు.

మన దేశాన్ని వ్యతిరేకిస్తారా..వారిని అస్సలు వదలొద్దు, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో టీంఇండియా మ్యాచ్ తర్వాత న్యూజీలాండ్‌ని చావు దొబ్బ కొట్టాలన్న అక్తర్

పంజాబ్‌కు 42 బంతుల్లో 60 రన్స్‌ కావాల్సి ఉండగా పూరన్‌ (32), మార్‌క్రమ్‌ (26 నాటౌట్‌) మూడో వికెట్‌కు 57 రన్స్‌ జోడించడంతో గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే చివరి ఓవర్‌లో కార్తీక్‌ త్యాగి వండర్‌ చేశాడు. విజయానికి 4 రన్స్‌ అవసర మవగా ఒకే పరుగిచ్చి పూరన్‌, హూడా (0)లను అవుట్‌ చేశాడు. దీంతో చివరి బంతికి 3 రన్స్‌ కావాల్సి ఉండగా సింగిల్‌ కూడా రాకపోవడంతో రాజస్థాన్‌ గట్టెక్కింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: లూయిస్‌ (సి) మయాంక్‌ (బి) అర్ష్‌దీప్‌ 36; జైశ్వాల్‌ (సి) మయాంక్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 49; శాంసన్‌ (సి) రాహుల్‌ (బి) పోరెల్‌ 4; లివింగ్‌స్టోన్‌ (సి) ఆలెన్‌ (బి) అర్ష్‌దీప్‌ 25; మహిపాల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) అర్ష్‌దీప్‌ 43; రియాన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షమి 4; తెవాటియా (బి) షమి 2; మోరిస్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షమి 5; సకారియా (సి అండ్‌ బి) అర్ష్‌దీప్‌ 7; కార్తీక్‌ త్యాగి (బి) అర్ష్‌దీప్‌ 1; ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 185 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-54, 2-68, 3-116, 4-136, 5-166, 6-169, 7-175, 8-178, 9-185, 10-185. బౌలింగ్‌: షమి 4-0-21-3; పోరెల్‌ 4-0-39-1; దీపక్‌ హూడా 2-0-37-0; అర్ష్‌దీప్‌ 4-0-32-5; రషీద్‌ 3-0-35-0; హర్‌ప్రీత్‌ 3-0-17-1.

పంజాబ్‌: రాహుల్‌ (సి) త్యాగి (బి) సకారియా 49; మయాంక్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) తెవాటియా 67; మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 26; పూరన్‌ (సి) శాంసన్‌ (బి) త్యాగి 32; దీపక్‌ (సి) శాంసన్‌ (బి) త్యాగి 0; ఫాబియెన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 183/4; వికెట్ల పతనం: 1-120, 2-126, 3-183, 4-183; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-30-0; సకారియా 3-0-31-1; త్యాగి 4-0-29-2; మోరిస్‌ 4-0-47-0; తెవాటియా 3-0-23-1; మహిపా ల్‌ లోమ్రోర్‌ 1-0-7-0; పరాగ్‌ 1-0-16-0.