DC vs SRH Stat Highlights Dream11 IPL 2020: ఢిల్లీ హ్యాట్రిక్ ఆశలు ఆవిరి, రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి విజయం, 15 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC vs SRH Stat Highlights Dream11 IPL 2020) ఓడించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండు ఓటములతో తర్వాత విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో రాణించడంతో సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించినా గెలుపును అందుకుంది. కాగా, హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న ఢిల్లీ ఆశలు తీరలేదు.
సమష్టి ప్రదర్శనతో ఐపీఎల్–2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC vs SRH Stat Highlights Dream11 IPL 2020) ఓడించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండు ఓటములతో తర్వాత విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో రాణించడంతో సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించినా గెలుపును అందుకుంది. కాగా, హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న ఢిల్లీ ఆశలు తీరలేదు.
ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) (34; 31 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్ పంత్(28; 27 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మెయిర్(21; 12 బంతుల్లో 2 సిక్స్‌లు)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించాడు. నటరాజన్, ఖలీల్ అహ్మద్‌కు వికెట్‌కు దక్కింది. ఢిల్లీని 147 పరుగులకే కట్టడి చేసిన ఆరెంజ్ ఆర్మీ ఖాతా తెరిచింది.
అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(45; 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో(53; 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్( 41; 26 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించడంతో పోరాడే స్కోరును ఉంచకల్గింది. టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ను వార్నర్, బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 77 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వార్నర్ ఔటయ్యాడు.
అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వార్నర్ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతిని పంత్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇక మనీష్ పాండే(3) నిరాశపరిచాడు. మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప‍్రయత్నంలో రబడా క్యాచ్ పట్టడంతో పాండే ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన విలియమన్స్ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమన్స్ వచ్చిన దగ్గర నుంచి మంచి టచ్‌లో కనిపించాడు. బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బెయిర్ స్టో మూడో వికెట్‌గా ఔట్ కాగా, రబడా వేసిన ఆఖరి ఓవర్‌లో షాట్ కొట్టిన విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. అబ్దుల్ సామద్(12 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా, మిశ్రాలు తలో రెండు వికెట్లు సాధించారు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పంత్ (బి) మిశ్రా 45; బెయిర్‌స్టో (సి) నోర్జే (బి) రబడ 53; మనీశ్ పాండే (సి) రబడ (బి) మిశ్రా 3; విలియమ్సన్ (సి) అక్షర్ (బి) రబడ 41; సమద్ (నాటౌట్) 12; అభిషేక్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–77; 2–92; 3–144; 4–160.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 3–0–26–0; రబడ 4–0–21–2; నోర్జే 4–0–40–0; స్టొయినిస్ 3–0–22–0; అమిత్ మిశ్రా 4–0–35–2; అక్షర్ పటేల్ 2–0–14–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 2; ధావన్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ 34; అయ్యర్ (సి) సమద్ (బి) రషీద్ 17; పంత్ (సి) గార్గ్ (బి) రషీద్ 32; హెట్‌మైర్ (సి) పాండే (బి) భువనేశ్వర్ 21; స్టొయినిస్ (ఎల్బీ) (బి) నటరాజన్ 11; అక్షర్ (బి) ఖలీల్ 5; రబడ (నాటౌట్) 15; నోర్జే (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 147.