Chris Cairns Health Update: చావుబతుకుల్లో నాటి ప్రపంచ ఉత్తమ ఆల్ రౌండర్, గుండె సంబంధిత వ్యాధితో వెంటిలేటర్‌పై న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన వైద్యులు
కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న 51 ఏళ్ల కెయిన్స్ (Former New Zealand All-rounder Chris Cairns) ప్రస్తుతం కాన్‌బెర్రాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న 51 ఏళ్ల కెయిన్స్ (Former New Zealand All-rounder Chris Cairns) ప్రస్తుతం కాన్‌బెర్రాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని న్యూజిలాండ్ హెరాల్డ్ మీడియా తెలిపింది. మరింత మెరుగైన చికిత్స కోసం అతడిని త్వరలోనే సిడ్నీలోని ఓ స్పెషలిస్టు ఆసుపత్రికి తరలించనున్నారు.
ఇప్పటికే అతనికి వివిధ సర్జరీలు చేసినా ఫలితం లేకపోయింది. అతని ప్రధాన గుండెనాళంలో చీలిక ఉన్నట్టు వైద్యులు ఇదివరకే గుర్తించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కెయిర్న్స్ పరిస్థితి విషమంగానే ఉన్నా చికిత్సకు (Chris Cairns Health Update) స్పందిస్తున్నారని చెప్పారు. గుండె మార్పిడి చేయబోతున్నట్టు వివరించారు. ప్రస్తుతం దాత కోసం చూస్తున్నామన్నారు. కాగా, ఆయనకు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోందని కెయిర్న్స్ భార్య మెలానీ చెప్పారు. కాన్ బెర్రాలో ఉండగానే అతడి గుండెకు అతిపెద్ద సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో కాన్ బెర్రా, సిడ్నీల్లో శస్త్రచికిత్సలు చేశారన్నారు. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ జట్టులోని మేటి ఆల్ రౌండర్లలో క్రిస్ కెయిర్న్స్ ఎప్పటికీ ఉంటారని చెప్పారు.
90వ దశకంలో ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కెయిన్స్ (All-rounder Chris Cairns) కివీస్ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 33.53 సగటుతో 3,320 పరుగులు చేసి.. 218 వికెట్లు పడగొట్టాడు. వన్డేలో 4,950 పరుగులు చేసి.. 201 వికెట్లు తీశాడు. నిజానికి ఒక్క క్రికెట్టే కాదు.. వర్చువల్ స్పోర్ట్స్ సంస్థను ఆయన నడిపారు. దుబాయ్ లో వజ్రాల వ్యాపారిగా మారారు. కానీ, ఒక్కసారిగా ఆయన ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఉన్నవన్నీ ఊడ్చుకుపోవడంతో, బతుకు బండిని నడిపించేందుకు గంటకు 17 డాలర్ల జీతానికి ఓ ట్రక్ డ్రైవర్ గా మారాల్సి వచ్చింది.